TDP MLAs and MLCs took out a protest rally to the assembly carrying Bullock Cart | ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ పునఃప్రారంభం అయ్యాయి. ఇవ్వాళ ఎనిమిది బిల్లులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రవేశపెట్టనుంది. విద్య, వైద్యం, నాడు-నేడులో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్, రైతు భరోసా కేంద్రాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్న పారిశ్రామికరంగ అభివృద్ధి.. వంటి అంశాలపై చర్చిస్తోంది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌పై జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలపై సభ్యులు గొల్ల బాబురావు, కిలారు రోశయ్య మాట్లాడారు.
#AndhraPradesh
#TDP
#NaraLokesh
#YSRCP
#CMjagan
#APassembly